- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Social media:15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఫ్రాన్స్ కీలక నిర్ణయం
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: పిల్లలపై సోషల్ మీడియా (Social media) ప్రభావాన్ని తగ్గించేందుకు ఫ్రాన్స్ (France) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.15 ఏళ్ళలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించనున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Immanual macron) తెలిపారు. యూరోపియన్ యూనియన్ (EU) ఈ తరహా చర్యలు తీసుకోకపోతే రాబోయే నెలల్లో తమ దేశంలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కఠిన చట్టాలు రూపొందిస్తామన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘15 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలను నిషేధించాలి. ఈ దిశగా ఈయూ నుంచి ప్రయత్నాలు ఆశిస్తున్నా. లేకపోతే ఫ్రాన్స్ స్వయంగా చర్యలు తీసుకుంటుంది. మేము ఇక వేచి ఉండలేము’ అని అన్నారు. యువతలో హింస సంస్కృతిని ప్రోత్సహించడంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఒక ప్రధాన కారణంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తూర్పు ఫ్రాన్స్‌లోని నోజెంట్‌లోని ఒక మిడిల్ స్కూల్‌లో జరిగిన విషాద ఘటన అనంతరం మాక్రాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. నగరంలోని ఒక స్కూల్‌లో 14 ఏళ్ల విద్యార్థి తన బ్యాగ్ చెక్ చేస్తుండగా సిబ్బందిని కత్తితో పొడిచి చంపాడు. అయితే ఆ ఘటనకు సోషల్ మీడియా ప్రభావమే కారణమని పలు కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే మాక్రాన్ పై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై బ్యాన్ విధించింది. ఫ్రాన్స్ సైతం తన నిర్ణయాన్ని అమలు చేస్తే రెండో దేశంగా నిలవనుంది.






