మనాలిలో మంచు వర్షం.. కనువిందు చేస్తున్న అందమైన దృశ్యాలు

by Ramesh Naini |

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలిలో భారీగా మంచు కురవడంతో తెల్లని మంచుతో పర్వతాలు, రహదారులు కప్పుకుపోయి అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

మనాలిలో మంచు వర్షం.. కనువిందు చేస్తున్న అందమైన దృశ్యాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం మనాలిలో భారీగా మంచు కురవడంతో తెల్లని మంచుతో పర్వతాలు, రహదారులు కప్పుకుపోయి అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అయితే, మంచు వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కుల్లు జిల్లాలోని Atal Tunnel సమీపంలో మంచు పడటంతో అటల్‌ టన్నెల్‌కు వెళ్లే రహదారులు పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది.

ఈ పరిస్థితుల వల్ల అనేక వాహనాలు నియంత్రణ కోల్పోయి నిలిచిపోయాయి. ఫలితంగా అటల్‌ టన్నెల్‌ దక్షిణ ద్వారం వద్ద సుమారు 1,000కు పైగా వాహనాలు నిలిచిపోయినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో లాహౌల్‌ లోయలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లిన పర్యాటకుల వాహనాలు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే మనాలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. పోలీసు బృందాలు పలు గంటలుగా అక్కడే ఉండి వాహనాలను సురక్షితంగా తిరిగి మనాలి వైపు మళ్లిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నాయి. అలాగే భారీ యంత్రాలు, మట్టి, యూరియా వంటి రసాయనాల సహాయంతో రహదారులపై పేరుకున్న మంచును తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Next Story