Uttarakhand: సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిన మంచు.. వీడియో వైరల్‌

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-01 12:22:32  IST  )

ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తోంది.

Uttarakhand: సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిన మంచు.. వీడియో వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తోంది. దీంతో చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగిపడి సుమారు 57 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, బద్రీనాథ్ ధామ్‌కు 3 కిలోమీటర్ల దూరంలోని మానా గ్రామంలో శుక్రవారం ఉదయం భారీగా హిమపాతం దూసుకువచ్చింది. రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు (BRO) చెందిన కార్మికులు మంచుచరియల కింద చిక్కుకున్నారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRFఎన్డీఆర్‌ఎఫ్‌), జిల్లా యంత్రాంగం, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు (ITBP), సరిహద్దు రోడ్ల సంస్థ (BRO) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మంచు గడ్డల కింద చిక్కుకున్న పది మంది కార్మికులను రక్షించారు. మిగతా వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, భారీగా మంచుకురుస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. కాగా, ఉత్తరాఖండ్‌తో సహా అనేక కొండ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది.

Next Story