- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజస్థాన్ ఎడారిపై మంచు దుప్పటి.. కశ్మీర్‌ను తలపిస్తున్న ఇసుక తిన్నెలు వైరల్
రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతం కశ్మీర్‌ను తలపిస్తోంది. బికానెర్ జిల్లాలోని అర్జున్‌సర్, రజియాసర్ ప్రాంతాల్లో ఏప్రిల్ 3, 2026న కురిసిన భారీ వడగళ్ల వానతో ఇసుక తిన్నెలన్నీ పూర్తిగా మంచు దుప్పట్లో కప్పుకుపోయి కనిపించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతం కశ్మీర్‌ను తలపిస్తోంది. బికానెర్ జిల్లాలోని అర్జున్‌సర్, రజియాసర్ ప్రాంతాల్లో ఏప్రిల్ 3, 2026న కురిసిన భారీ వడగళ్ల వానతో ఇసుక తిన్నెలన్నీ పూర్తిగా మంచు దుప్పట్లో కప్పుకుపోయి కనిపించాయి. మధ్యధరా సముద్రం మీదుగా వచ్చిన ‘పశ్చిమ విక్షోభం’ (Western Disturbance) ప్రభావంతోనే ఈ ఆకస్మిక వాతావరణ మార్పులు సంభవించినట్లు కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక్కడ వేడి గాలులు, చల్లటి గాలులు ఢీకొనడం వల్ల ఈ భారీ వడగళ్ల వాన కురిసిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
వాతావరణ హెచ్చరిక..
ఈ అకాల వర్షం రైతులను తీవ్ర కష్టాల్లోకి నెట్టింది. కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ తదితర రబీ పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నష్టపోయిన రైతులను పంటల బీమా ద్వారా ఆదుకునేందుకు నిపుణులు, అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ తరహా వాతావరణ పరిస్థితులు ఏప్రిల్ 7 వరకు జైపూర్, జోధ్‌పూర్ తదితర ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. కాగా, మంచు కురిసిన ప్రాంతాల ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.






