విమానంలో పాము కలకలం.. 2 గంటల పాటు నిలిచిన ప్రయాణం

by Yella Dhawani Reddy |

సాధారణంగా విమాన ప్రయాణం అనేది వేగంగా, సౌకర్యంగా, ముఖ్యంగా సురక్షితంగా ఉంటుందని అందరికీ అభిప్రాయం.

విమానంలో పాము కలకలం.. 2 గంటల పాటు నిలిచిన ప్రయాణం
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా విమాన ప్రయాణం అనేది వేగంగా, సౌకర్యంగా, ముఖ్యంగా సురక్షితంగా ఉంటుందని అందరికీ అభిప్రాయం. కానీ ఇటీవల కాలంలో ఎక్కడ ఏ అనూహ్య ఘటన ఎదురవుతుందోనన్న భయం ప్రయాణికుల్లో పెరుగుతోంది. టెక్నికల్ లోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లు, వాతావరణ సమస్యలు అన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు నేరుగా పాములే విమానంలోకి ప్రవేశించే షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ విమానంలో పాము కనిపించి రెండు గంటల పాటు ప్రయాణాన్ని నిలిపివేసింది. ఈ అసాధారణ ఘటనపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మెల్‌బోర్న్‌ నుంచి బ్రిస్బేన్‌కు వెళ్లాల్సిన విమానంలో ఓ పాము కనిపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది తక్షణమే స్పందించి, పామును పట్టుకునేందుకు ప్రత్యేకంగా స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. పాము ఓ మూలన దాక్కొన్న కారణంగా పట్టుకోవడం కొంత సమయం పట్టింది. చివరికి రెండు గంటల శ్రమించి పామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం పరీక్షించగా అది విషపూరితం కాదని తెలిసింది.ఈ ఘటన కారణంగా విమాన ప్రయాణం రెండు గంటల పాటు ఆలస్యం కావాల్సి వచ్చింది. అనంతరం ప్రయాణం మళ్లీ ప్రారంభమై ప్రయాణికులను గమ్యస్థానానికి చేరవేశారు. ఎలాంటి హాని జరగకపోవడం అందరికీ ఊపిరి పీల్చేలా చేసింది.

Next Story