యువకుడిని కాటేసిన పాము.. వీడియో తీస్తూ ఉండిపోయిన జనాలు

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-21 11:54:58  IST  )

ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మోర్నా గ్రామానికి చెందిన యువకుడు పాము కాటుకు బలయ్యాడు. 24ఏళ్ల మోహిత్ విషపూరితమైన నాగుపాముతో ఆడాడు. పలు సార్లు కాటేసిన పట్టించుకోలేదు. అలాగే

యువకుడిని కాటేసిన పాము.. వీడియో తీస్తూ ఉండిపోయిన జనాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మోర్నా గ్రామానికి చెందిన యువకుడు పాము కాటుకు బలయ్యాడు. 24ఏళ్ల మోహిత్ విషపూరితమైన నాగుపాముతో ఆడాడు. పలు సార్లు కాటేసిన పట్టించుకోలేదు. అలాగే ఆట కంటిన్యూ చేశాడు. స్థానికులు కూడా వద్దని వారించేందుకు బదులుగా వీడియోలు తీస్తూ ఉండిపోయారు. దీంతో కాసేపటికే శ్వాసకోశ వైఫల్యంతో మరణించాడు. అయితే మోహిత్ ఫ్యామిలీ తమ కొడుకు చనిపోయేందుకు కారణం గ్రామానికి చెందిన మంగళ్ అని ఆరోపిస్తున్నారు. పాముతో ఆడితే డబ్బు ఇస్తాననే ఆశ చూపి.. కాటుకు గురయ్యేలా చేశాడని చెప్తున్నారు. మోహిత్‌ను హత్య చేసింది అతనే అని అంటున్నారు. దీంతో పాముతో ఆట కాస్త హత్యగా మారింది.

Next Story