- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cow smuggling: పుష్ప రేంజ్‌లో స్మగ్లింగ్.. కట్ చేస్తే ఆయిల్ ట్యాంకర్‌లో ఆవులు
పుష్ప సినిమా స్టైల్లో ఆవులను స్మగ్లింగ్ చేస్తున్న ఘటన జమ్మూ కాశ్మీర్‌లో చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పుష్ప సినిమా (Pushpa movie) స్టైల్లో ఆవులను స్మగ్లింగ్ (Cow smuggling) చేస్తున్న ఘటన జమ్మూ కాశ్మీర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం (Jammu and Kashmir) జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా గ్రనాయ్ ప్రాంతంలో పోలీసులు గోవుల స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు. ప్రత్యేకంగా మాడిఫై చేయబడిన ఆయిల్ ట్యాంకర్ లోపల గుహ మాదిరిగా (కావిటీస్) తయారు చేసి దాదాపు 20 కి పైగా ఆవులను అక్రమంగా తరలిస్తున్నారు.
చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు జరిపి ట్యాంకర్‌ను ఆపి లోపల పరిశీలించగా పశువులను చూసి షాక్ అయ్యారు. వెంటనే వాటిని రక్షించి సురక్షిత స్థలాలకు తరలించారు. ఆయిల్ ట్యాంకర్ రూపంలో బోవైన్ స్మగ్లింగ్ జరగడం ఆశ్చర్యం కలిగించే విషయమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఉధంపూర్ డిప్యూటీ ఎస్‌పీ ప్రహ్లాద్ శర్మ మాట్లాడుతూ.. ఉధంపూర్ పోలీసులు (Smuggling of cows) గోవుల అక్రమ రవాణాపై తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
అక్రమ రవాణపై ఈ రోజు సమాచారం అందడంతో చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేశామని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయిల్ ట్యాంకర్ నిలపకుండా పారిపోవడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. పోలీసులు వెంటనే వెంబడించగా డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. తనిఖీల్లో వాహనంలోని పశువులను గుర్తించాము. పోలీసులు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటన వీడియో ఇదే..






