- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Smoke Bomb Attack : పార్లమెంటులో స్మోక్ బాంబుల దాడి
స్మోక్ బాంబులు(Smoke Bombs), ఇతర పేలుడు పదార్థాలతో సెర్బియా పార్లమెంటు(Serbia Parliament)లో దాడులు జరిగాయి.

దిశ, వెబ్ డెస్క్ : స్మోక్ బాంబులు(Smoke Bombs), ఇతర పేలుడు పదార్థాలతో సెర్బియా పార్లమెంటు(Serbia Parliament)లో దాడులు జరిగాయి. ప్రతిపక్షాలు, అధికార పక్షాలు పేలుడు పదార్థాలు, వాటర్ బాటిల్లు, కోడిగుడ్ల పరస్పర దాడులతో పార్లమెంట్ రణరంగంగా మారింది. ఈ ఘటనలో పలువురు ఎంపీలకు తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. యూనివర్సిటీ బిల్లు(University Bill)ను ఆమోదించేందుకు చేపట్టిన ఓటింగ్ సమయంలో తీవ్ర ఆందోళన చెలరేగింది. అధికార పార్టీ తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో బ్యానర్లు ప్రదర్శిస్తూ విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యులకు గొడవ జరిగి.. స్మోక్ బాంబులతో, కోడిగుడ్లు, వాటర్ బాటిల్లు, ఇతర పేలుడు పదార్థాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పార్లమెంటు మొత్తం పొగతో అట్టుడికి పోయింది. ఎంపీలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ గొడవల్లో నలుగురు ఎంపీలకు గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరికి సీరియస్ గా ఉందని అధికారులు తెలియజేశారు.
అయితే గత నవంబరులో ఒ రైల్వే స్టేషన్ పైకప్పు కూలి 15 మంది విద్యార్థులు మరణించారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లోని విద్యార్థులు అవినీతి నిర్మూలన(Anti Curruption Movment) ఉద్యమం చేపట్టగా.. ఆ ఉద్యమానికి మేధావులు, న్యాయమూర్తులు, రైతులు, ప్రజల నుంచి భారీ ఎత్తున మద్ధతు లభించింది. ఈ ఉద్యమం ఫలితంగా ఏకంగా సెర్బియా ప్రధానమంత్రి మిలోస్ వుచెవిచ్(PM Milos Vucevic) రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆమోదించకుండా అధికారపక్షం పలు బిల్లులు ఆమోదించాలని చూస్తుండటంతో పార్లమెంటులో విపక్షాలు నిరసనకు దిగగా.. అవి కాస్త తీవ్ర ఘర్షణలకు దారితీసాయి.






