భద్రత ఎలా కల్పించాలో మోడీ,షాలకు కనీస అవగాహన లేదు..బుడ్డోడి మాటలు వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-25 14:22:56  IST  )

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక రక్షణశాఖ లోపం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దాడిని ముందే ఎందుకు ఇంటిలిజెన్స్ గుర్తించలేకపోయిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

భద్రత ఎలా కల్పించాలో మోడీ,షాలకు కనీస అవగాహన లేదు..బుడ్డోడి మాటలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి వెనుక రక్షణశాఖ లోపం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దాడిని ముందే ఎందుకు ఇంటిలిజెన్స్ గుర్తించలేకపోయిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దాడి జ‌రిగిన త‌ర‌వాత చాలా సేప‌టి వ‌ర‌కు అక్క‌డ‌కు ఆర్మీ చేరుకోలేక‌పోయింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు దాడి జ‌రిగిన త‌ర‌వాత కూడా కేంద్రం త‌మ త‌ప్పు లేద‌ని ప్ర‌చారం చేసుకుంటోంద‌ని ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి. తాజాగా ఉగ్ర‌దాడి గురించి మీడియాతో మాట్లాడుతూ ఓ బుడ్డోడు కేంద్రంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శలు చేశాడు. తన తండ్రి ఉగ్రదాడిలో మరణించడంతో ఎంతో ఆవేదన చెందుతూ మాట్లాడాడు.

మోడీ, అమిత్ షా ప్ర‌జ‌ల ప్రాణాల‌తో రాజ‌కీయ క్రీడ‌లు ఆడుతున్నారంటూ మండిప‌డ్డాడు. ఇలాంటి సెన్సటివ్ టూరిస్ట్ ప్లేసెస్ లో భద్రత ఎలా పెంచాలో, ఎలా రక్షణ కల్పించాలో కనీస అవగాహన లేదని విమ‌ర్శించాడు. పహ‌ల్గామ్ లాంటి టూరిస్ట్ ప్లేసెస్ ఆర్మీని ఉండేలా చూడాలన్నారు. ఇందులో కేంద్రం వైఫల్యం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం చిన్నపిల్లవాడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతడి మాటలు విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్నవయసులో ఎంత నాలెడ్జ్ ఉందో అని ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్‌లో మంచి నాయకుడు అవుతాడని కామెంట్లు చేస్తున్నారు.

Next Story