- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోక్‌సభలో నినాదాల హోరు.. SIRపై చర్చకు విపక్షాల పట్టు, సభ వాయిదా
జాతీయ గీతాలాపనతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ గీతాలాపనతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) ఇటీవల మృతి చెందిన సభ్యుల పేర్లను చదివి వినిపించగా, లోక్‌సభ సంతాపం తెలిపింది. వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళా జట్టుకు సభ ప్రత్యేకంగా అభినందించింది. ఇక ఓటర్ల జాబితా సవరణ, దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యంపై సభలో చర్చకు కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానాలను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. అదేవిధంగా SIR పై సమగ్రంగా చర్చించాలంటూ మరోవైపు లోక్‌సభలో ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా తీర్మానం ఇచ్చారు.
అనంతరం ప్రశ్నోత్తరాలను స్పీకర్ ప్రారంభించగా.. కాంగ్రెస్ (Congress)తో పాటు విపక్ష సభ్యులు తమ స్థానాల్లో లేచి నిలబడి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో SIRతో ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దని గొంతు పోయేలా సభ్యులు అరిచారు. ఈ క్రమంలోనే వెంటనే నినాదాలు ఆపాలని.. శాంతియుతంగా చర్చింద్దామని చెప్పినా వారు వినలేదు. దీంతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. కాగా, రాబోయే 15 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో అణు ఇంధన బిల్లు-2025తో పాటు ఉన్నత విద్యా బిల్లు, మరో 8 బిల్లులు సభ ముందుకు రానున్నాయి. అయితే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై స్పీకర్ ఓం బిర్లా నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.






