- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ సభలో తొక్కిసలాటకు ముందు షాకింగ్ ఘటన.. వీడియో వైరల్
తమిళస్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత తళపతి విజయ్ నిర్వహించిన పొలిటికల్ సభలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళస్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత తళపతి విజయ్ నిర్వహించిన పొలిటికల్ సభలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు. మృతులలో చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలకు టీవీకే పార్టీ రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించగా, ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఘటనకు టీవీకే పార్టీనే కారణం అని ప్రభుత్వం, ఇతర పార్టీలు ఆరోపిస్తుంటే.. టీవీకే మాత్రం ఇది డీఎంకే ప్రభుత్వం చేసిన కుట్ర అని మండిపడుతోంది.
సభ కోసం తాము 10 వేల మందికి అనుమతి ఇస్తే అక్కడకు దాదాపు 30 నుండి 60వేల మంది చేరుకోవడం వల్లనే తొక్కిసలాట జరిగిందని, విజయ్ ఆరుగంటలు ఆసల్యంగా రావడంతో అభిమానులు, కార్యకర్తలు ఆకలితో వేచి చూశారని డీజీపీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే తొక్కిసలాటకు ముందు విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనపై చెప్పుల దాడి జరిగింది. వెనక నుండి ఎవరో చెప్పులు విసరగా వాటిని విజయ్ పక్కనే ఉన్న సెక్యురిటీ సిబ్బంది పక్కకు తోసేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా ఇది డీఎంకే కుట్రనే అంటూ విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. video






