- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SLBC టన్నెల్ నిర్మాణ సంస్థ ఎండీ మనోజ్ గౌర్ అరెస్టు.. కొనసాగుతోన్న ED, CBI దర్యాప్తు
శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ (SLBC) నిర్మాణ సంస్థ జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ (Jaypee Infratech Ltd) మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ (Manoj Gaur)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ (SLBC) నిర్మాణ పనులు చేపడుతోన్న జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ (Jaypee Infratech Limited) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ (Manoj Gaur)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. రూ.12 వేల కోట్లకు పైగా మనీ లాండరింగ్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నోయిడా, గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులలో 40 వేల మంది హోమ్‌బైయర్లు డబ్బు హోమ్ బయ్యర్ల నుంచి భారీ ఎత్తున వసూలు చేసిన డబ్బును దారి మళ్లించారనే ఆరోపణలు మనోజ్ గౌర్‌పై ఉన్నాయి. జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (JAL)కు చెందిన ఇతర కంపెనీలకు ఆ మొత్తం నిధులు బదిలీ చేశారని అభియోగం మేరకు PMLA (Prevention of Money Laundering Act) కింద ఆయనపై కేసు నమోదు కాగా.. సీబీఐ, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈడీ ఢిల్లీ, నోయిడాలోని మనోజ్ గౌర్ ఆఫీసులు, రెసిడెన్స్‌లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకుంది. ఇప్పటికేవ వరకు రూ.2 వేల కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అధికారులు సీజ్ చేశారు.






