- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైల్వే బ్రిడ్జి శ్లాబ్ పెచ్చులూడి మహిళ మృతి
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్హార్షా రైల్వే బ్రిడ్జి శ్లాబ్ పెచ్చులూడి మీద పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

X
దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్హార్షా రైల్వే బ్రిడ్జి శ్లాబ్ పెచ్చులూడి మీద పడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో గాయపడ్డ ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన రైల్వే శాఖ అధికారులు క్షతగాత్రులను పరామర్శించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడ్డవారికి 50 వేల ఎక్స్ గ్రేషియాను రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను ప్రైవేట్ హాస్పిటల్స్ కి తరలించారు. క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వైద్య ఖర్చులను భరించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
Next Story






