- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాంకాక్‌లో కాల్పుల మోత.. ఏకంగా ఆరుగురు దుర్మరణం
టూరిస్టులకు స్వర్గధామం అయిన బ్యాంకాక్‌లో ఇవాళ కాల్పులు మోత మోగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: టూరిస్టులకు స్వర్గధామం అయిన బ్యాంకాక్ (Bangkok)లో ఇవాళ కాల్పులు మోత మోగింది. ఓర్ టో కో మార్కెట్ (Or To Ko Market)లో పౌరులపైకి ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులుకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో నలుగురు భద్రతా సిబ్బందితో పాటు ఓ మహిళ తీవ్రమైన బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లుగా రవాన్ ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ (Rawan Emergency Medical Center) తెలిపింది. కాల్పులు అనంతరం దుండగుడు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలపై షూట్ చేసుకుని మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






