wrong injection: నర్సు తప్పుడు ఇంజక్షన్.. ఆరుగురు రోగులు మృతి

by Prasad Jukanti |

ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది.

wrong injection: నర్సు తప్పుడు ఇంజక్షన్.. ఆరుగురు రోగులు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇంజెక్షన్ వికటించిన కారణంగా ఆరుగురు రోగులు మృతి చెందిన ఘటన ఒడిశాలో (Odisha) తీవ్ర కలకలం రేపింది. కోరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. అయితే వీరంతా చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఆస్పత్రి సిబ్బంది వీరికి రెండో రౌండ్ ఇంజెక్షన్లు వేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో ఓ నర్సు వచ్చి పేషంట్లకు ఇంజెక్షన్ చేసిందని, ఆ తర్వాత కొన్ని క్షణాలకే రోగులు నొప్పితో విలవిల్లాడిపోయారని, డాక్టర్లు వచ్చి చూసే లోపే వారంతా ప్రాణాలు కోల్పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఇవాళ ఉదయం మరో రోగికి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ కాసేపటికే ఆ రోగి కూడా చనిపోవడం సంచలనంగా మారింది. వీరందరికి ఇదే ఆస్పత్రిలో సర్జరీలు జరిగాయని ఆతర్వాత వారి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. తప్పుడు ఇంజక్షన్ (wrong injection) వల్లే తమ వారు చనిపోయారని,నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోగుల మృతికి గల కారణాలు పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాతే తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

Next Story