- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిసోడియా ప్రాణాలకు ముప్పు! ఆప్ సంచలన ఆరోపణలు
by Sathputhe Rajesh |
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రాణాలకు ముప్పు ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించడం కలకలం రేపుతోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రాణాలకు ముప్పు ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించడం కలకలం రేపుతోంది. తిహార్ జైలులో సిసోడియాను ప్రమాదకరమైన నేరస్థులతో కలిపి ఉంచినట్లు ఆ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన సిసోడియాకు 'విపాసనా సెల్'ను తిరస్కరించారని మరియు ఇతర భయంకరమైన నేరస్థులతో ఉంచారని ఆరోపించారు. ఎంసీడీ ఎన్నికల్లో ఆప్‌ను ఓడించలేక పగను పెంచుకుని బీజేపీ సిసోడియాను అరెస్ట్ చేసిందని విమర్శలు గుప్పించారు. కోర్టు ఆదేశాల ప్రకారం సిసోడియాను మెడిటేషన్ సెల్‌లో ఉంచాల్సి ఉన్నప్పటికీ జైలు నెంబర్ 1లో ఉంచారని దీనికి కేంద్రం బదులు చెప్పాల్సి ఉంటుందన్నారు.
Next Story






