- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SIR: ఎస్ఐఆర్ చేపట్టే హక్కు పూర్తిగా ఎన్నికల సంఘానిదే.. సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ
క్రమం తప్పకుండా ఎస్ఐఆర్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం ఎన్నికల సంఘం అధికార పరిధిని ఉల్లంఘించడమే అవుతుందని ఈసీ తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా క్రమం తప్పకుండా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం ఎన్నికల సంఘం అధికార పరిధిని ఉల్లంఘించడమే అవుతుందని ఈసీ తెలిపింది. ఎస్ఐఆర్ చేపట్టడం తమ హక్కు అని పేర్కొంది. కోర్టు దీని కోసం ఆర్డర్స్ ఇస్తే అది తమ హక్కులో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో శనివారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఓటర్ల జాబితాను తయారు చేయడం, దానిని సవరించే పూర్తి అధికారం ఈసీకి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 (Article 324) లో ఈ విషయం స్పష్టంగా పేర్కొందని తెలిపింది. పార్లమెంటుకు, ప్రతి రాష్ట్ర శాసనసభకు జరిగే అన్ని ఎన్నికలకు ఓటర్ల జాబితా తయారీ, నిర్వహణ, పర్యవేక్షించే హక్కు ఈసీకి మాత్రమే ఉందని తెలిపింది.
‘ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 21, 1960లోని రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 25 ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌కు హక్కు ఉంది. ఈ ప్రక్రియ ఎలా నిర్వహించాలి, ఎంత కాలపరిమితిలోపు అనేది పూర్తిగా ఈసీదే నిర్ణయం. ఇందులో ఎటువంటి కోర్టు జోక్యం అవసరం లేదు’ అని తేల్చి చెప్పింది. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్నికల సంఘం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది.






