SIR: బిహార్‌లో ఎస్ఐఆర్‌పై పుకార్లకు బ్రేక్.. ప్రక్రియపై క్లారిటీ ఇచ్చిన ఈసీ

by B.Srinivas |

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ పై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈసీ క్లారిటీ ఇచ్చింది.

SIR: బిహార్‌లో ఎస్ఐఆర్‌పై పుకార్లకు బ్రేక్.. ప్రక్రియపై క్లారిటీ ఇచ్చిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (ఎస్ఐఆర్) పై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఎస్ఐఆర్ పని తమ ఆదేశాల ప్రకారమే జరుగుతుందని తెలిపింది. ఈ ప్రక్రియలో ఎటువంటి మార్పులు చేయలేదని, గతంలో ఉన్న నిబంధనలకు లోబడే ప్రాసెస్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. గణన ఫారమ్ ప్రింట్, పంపిణీ పనులు త్వరలోనే పూర్తి కానుందని తెలిపింది. 2025 జూన్ 4న జారీ చేసిన ఆదేశాల ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది. అందులో ఎటువంటి మార్పులూ చేయలేదని వెల్లడించింది. ఆగస్టు 1న ముసాయిదా జాబితా రిలీజ్ చేస్తామని తెలిపింది. ప్రస్తుత ఓటర్లు డాక్యుమెంటేషన్ పూర్తి చేయడానికి వీలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ఫారమ్ లు జూలై 25లోపు ఎప్పుడైనా సమర్పించొచ్చని తెలిపింది.

కాగా, రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో మాత్రమే నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాలను ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తు్న్నాయి. అంతేగాక బిహార్‌లో జరుగుతున్న ప్రత్యేక సవరణపై ఎన్నికల కమిషన్ ఒక వార్తాపత్రికలో ప్రకటన ఇచ్చింది. అందులో పత్రాలు లేని వారు నామినేషన్ ఫారమ్‌ను మాత్రమే సమర్పించొచ్చని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పుకార్లు వెల్లువెత్తడంతో ఈసీ క్లారిటీ ఇచ్చింది.

Next Story