- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటరి తండ్రి పోరాటం.. చిన్నారితో కలిసి ఆటోలోనే జీవన ప్రయాణం వైరల్
తండ్రి ప్రేమకు సాటి ఏదీ లేదని నిరూపిస్తున్నాడో ఆటో డ్రైవర్. కంటిపాపలా కాపాడాల్సిన భార్య కాలం చేసినా, తన బాధ్యతను విస్మరించకుండా, చిన్నారిని సాకుతున్న తీరు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసును కదిలించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తండ్రి ప్రేమకు సాటి ఏదీ లేదని నిరూపిస్తున్నాడో ఆటో డ్రైవర్. కంటిపాపలా కాపాడాల్సిన భార్య కాలం చేసినా, తన బాధ్యతను విస్మరించకుండా, చిన్నారిని సాకుతున్న తీరు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసును కదిలించింది. మహారాష్ట్రకు చెందిన ఈ ఆటో డ్రైవర్ కథ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తి భార్య మరణించింది. దీంతో తన చిన్నారి కూతురిని చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా అతనిపైనే పడింది. పసిపాపను ఇంట్లో ఒంటరిగా వదిలి రాలేక, అలాగని పనికి వెళ్లకపోతే పూట గడవని స్థితిలో ఆ తండ్రి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఆటోలోనే పక్కనే కూతురిని కూర్చోబెట్టుకుని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాడు.
వెలుగులోకి తెచ్చిన కస్టమర్..
ఇటీవల అతని ఆటో ఎక్కిన ఒక ప్రయాణికుడు, సీటు వెనుక లాగేజీ పెట్టే ప్లేస్‌లో నిద్రిస్తున్న చిన్నారిని చూసి ఆశ్చర్యపోయాడు. పాప ఎవరని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. భార్య లేని లోటును తనే తీరుస్తూ, అటు వృత్తిని, ఇటు తండ్రిగా తన బాధ్యతను బ్యాలెన్స్ చేస్తున్న తీరుకు ఆ కస్టమర్ ఫిదా అయ్యాడు. వెంటనే ఆ తండ్రీకూతుళ్లకు ఫ్రూట్ జ్యూస్ ఇప్పించి, కాసేపు చిన్నారిని సరదాగా పలకరించి పేరు కనుకున్నాడు. వారిపై ఉన్న గౌరవంతో ఆ దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "సింగిల్ పేరెంట్స్ పడే కష్టం మాటల్లో చెప్పలేనిది. ఈ తండ్రికి సెల్యూట్" అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. బాధ్యత గల తండ్రిగా అతను చూపిస్తున్న ప్రేమను చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది.






