- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్
విలాసవంతమైన నగరాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా వినిపించేపేరు సింగపూర్. విలాసవంతమైన నగరాల్లో డబ్బులు కూాడ ఎక్కువగానే ఖర్చు అవుతాయి.

దిశ, వెబ్ డెస్క్: విలాసవంతమైన నగరాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా వినిపించేపేరు సింగపూర్. విలాసవంతమైన నగరాల్లో డబ్బులు కూాడ ఎక్కువగానే ఖర్చు అవుతాయి. కాబట్టి అవి ఖరీదైన నగరాలు అని కూడా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు సింగపూర్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా వరుసగా మూడో సారి నిలిచింది. జూలియస్ బేర్ అనే నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇక ఇదివరకు రెండో స్థానంలో హాంకాంగ్ ఉండగా ఇప్పుడు దాన్ని పక్కకు నెట్టి లండన్ రెండో స్థానానికి చేరుకుంది. హాంకాంగ్ మూడో స్థానానికి చేరుకుంది. ఒక మిలియన్ డాలర్ల బ్యాంక్ బ్యాలెన్స్ కలిగిన వ్యక్తులు, వాళ్లు కొనుగోళు చేస్తున్న వస్తువులు, అనుభవిస్తున్న విలాసాల ఆధారంగా వారి జీవన వ్యయాన్ని జూలియస్ బేర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ విశ్లేషించి ఈ నివేదికను తయారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి మధ్య డేటా ఆధారంగా నివేదికను సిద్ధం చేయగా సింగపూర్‌ను అత్యంత ఖరీదైన నగరంగా గుర్తించింది.






