PM Modi: 22 నిమిషాల్లో ఉగ్రవాదులను మట్టికరిపించిన భారత సైన్యం: ప్రధాని మోడీ

by S Gopi |

సిందూర్ బరూద్‌గా పేలింది. దాని ఫలితాన్ని పాకిస్తాన్ చూసింది.

PM Modi: 22 నిమిషాల్లో ఉగ్రవాదులను మట్టికరిపించిన భారత సైన్యం: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లోని 'సిందూర్' పాక్‌లో 'బరూద్ '(గన్‌పౌడర్‌)గా పేలినపుడు ఏం జరుగుతుందో మనదేశ శత్రువులు తెలుసుకున్నారని ప్రహాని నరేంద్ర మోడీ అన్నారు. మన దేశ మహిళల సిందూరాన్ని తుడిచేసిన పాకిస్తాన్‌ను భారత సైన్యం మోకరిల్లేలా చేసింది. ఏప్రిల్ 22న జరిగిన దాడికి ప్రతిగా 22 నిమిషాల్లో ఉగ్రవాద మూకను మట్టిలో కలిపేశామని, అది మన సైన్యం సత్తా అని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా భారత సాయుధ దళాలను ప్రశంసించారు. గురువారం రాజస్థాన్‌లోని బికనర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోడీ.. సిందూర్ బరూద్‌గా పేలింది. దాని ఫలితాన్ని పాకిస్తాన్ చూసింది. భారత్ అణు బెదిరింపులకు భయపడదని, దేశంలో ఉగ్రవాద దాడులు జరిగితే దానికి మించిన సమాధానం చెప్పగలమనే విషయం వారికి స్పష్టమైంది. సమయం, వ్యూహాన్ని మన సాయుధ దళాలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేసింది. ఇకమీదట పాకిస్తాన్‌లో ఎటువంటి వాణిజ్య చర్చలు జరగవు. చర్చలంటూ జరిగితే అవి పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే అవుతాయి. ఉగ్రవాద దాడికి దిగితే, పాకిస్తాన్ ఆర్మీ గానీ, ఆర్థికవ్యవస్థ గానీ భారీ మొత్తంలో మూల్యం చెల్లించక తప్పదనే విషయం ఆ దేశానికి స్పష్టమైందని మోడీ పేర్కొన్నారు. కాగా, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 స్టేషన్లను గురువారం రాజస్థాన్ నుంచి ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం 103లో తెలంగాణకు చెందిన వరంగల్, బేగంపేట, కరీంనగర్ స్టేషన్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి సూళ్లూరుపేట స్టేషన్ ఉంది.

Next Story