- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇమ్రాన్ ఖాన్ క్షేమంపై పాక్ మౌనం.. ఆందోళన వ్యక్తం చేసిన శశి థరూర్
జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఇమ్రాన్ ఖాన్ క్షేమంపై పాకిస్తాన్ ప్రభుత్వం మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, ఇమ్రాన్ ఖాన్ క్షేమంపై పాకిస్తాన్ ప్రభుత్వం మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శనివారం రాత్రి జాతీయ మీడియాతో పాక్ మాజీ ప్రధాని, PTI వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, క్షేమం గురించి వస్తున్న వదంతులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయంలో మౌనం వహించడంపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ఇతర దేశాల అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడం సరైనది కాదని, కానీ ఈ అంశంపై పాక్ ప్రభుత్వం, అధికారులు ఎక్కువ మౌనం వహించడం ఆందోళన కలిగించే విషయం అని పేర్కొన్నారు.
"పరిస్థితి విషమించింది అని పలువురు చెబుతున్నారు. కానీ అధికారులు ఏమీ మాట్లాడటం లేదని, ఈ మౌనం చెడ్డది" అని ఆయన అన్నారు. ఇమ్రాన్ ఖాన్ కుమారుడు, తన తండ్రి బతికే ఉన్నారని నిరూపించడానికి 'ప్రూఫ్ ఆఫ్ లైఫ్' కావాలని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా శశి థరూర్ గుర్తు చేస్తూ, ఇప్పటికీ దానికి సంబంధించిన రుజువు లభించలేదని థరూర్ తెలిపారు. ఇది విదేశాంగ విధాన అంశం కాకపోయినా, సాధారణ పౌరుడిగా తాను మాట్లాడుతున్నానని, ఎందుకంటే ఇక్కడ ఒక మానవుడి క్షేమం ఇమిడి ఉందని ఆయన నొక్కి చెప్పారు. "ఎవరినైనా జైల్లో పెట్టి, అదృశ్యం చేయలేరు. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే, అధికారులు దీనిపై స్పష్టత నివాళి" అని ఆయన పాకిస్తాన్ అధికారులను కోరారు.






