సిక్కు సైనికుల్లారా.. యుద్ధంలో పాల్గొనకండి : ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ

by Muthe.Rajitha |

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attock) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

సిక్కు సైనికుల్లారా.. యుద్ధంలో పాల్గొనకండి : ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ
X

దిశ, వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attock) అనంతరం భారత్-పాక్(Bharat-Pak) మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు దేశాలు ఒకదాని పట్ల మరొకటి కఠిన ఆంక్షలు విధించుకున్నాయి. పాక్ వీసాలు రద్దు చేసిన భారత్.. పాకిస్తానీయులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలిచ్చింది. అలాగే అటారి బోర్డర్ ను మూసి వేయడంతో పాటు, సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాక్ విమానాలు భారత గగనతలాన్ని మూసివేసింది. అటు పాక్ కూడా.. భారత్ వీసాలు రద్దు చేస్తూ, భారతీయులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇక సిమ్లా శాంతి ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా భారత విమానాలకు పాక్ గగన తలాన్ని మూసివేసింది. ఇరు దేశాల మధ్య అన్ని రకాల వ్యాపార, దౌత్య సంబంధాలన్నీ పూర్తిగా రద్దు చేసుకున్నాయి.

రెండు దేశాల దాదాపు యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూ(Khalistani Terrorist GuruPathvanth Pannun) సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. భారత్-పాక్ మధ్య యుద్ధం(Bharat-Pak War) అనివార్యం అయితే సిక్కు సైనికులు(Sikh Soldiers) ఎవరూ భారత్ తరపున యుద్ధంలో పాల్గొనకూడదని పిలుపునిచ్చాడు. యుద్ధం మొదలైతే పంజాబ్-పాక్ సరిహద్దు ప్రజలు పాకిస్తాన్ కి సహకరించాలి అని సూచించాడు. పోరు గనుక జరిగితే భారత్ కు మోడీకి ఇదే ఫైనల్ వార్ అని తెలిపాడు. పాక్ మీద దాడి జరిగితే సిక్కులు చూస్తూ కూర్చోవద్దని, ధీటుగా బదులివ్వాలని పన్నూ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశాడు.

Next Story