Viral: మోడీని విమర్శించా అంటే.. నేను రాహుల్ ఫ్యాన్ కాదు..! వైరల్ అవుతున్న సైన్ బోర్డు పోస్ట్

by Ramesh Naini |

దేశంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై సోషల్ మీడియా వేదికగా చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.

Viral: మోడీని విమర్శించా అంటే.. నేను రాహుల్ ఫ్యాన్ కాదు..! వైరల్ అవుతున్న సైన్ బోర్డు పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపై సోషల్ మీడియా వేదికగా చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వ పని తీరును ప్రతిపక్ష శ్రేణులు సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శించినప్పుడు అదే తీరులో ప్రభుత్వాలు కౌంటర్ ఇస్తుంటాయని అందరికీ తెలిసిందే. అయితే, కేంద్రంలో మోడీ ప్రభుత్వ తీరును… ప్రధాని తీసుకున్న నిర్ణయాలను ఏ పార్టీకి సంబంధం లేని సాధారణ వ్యక్తులు తప్పు బట్టినప్పుడు.. నువ్వు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడివని, ఉద్దేశం ప్రకారమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని బీజేపీ శ్రేణులు చెబుతాయని ప్రస్తుతం నెట్టింట చర్చానీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నేను (Rahul Gandhi) రాహుల్ గాంధీ ఫ్యాన్‌ కాదు అంటూ సోషల్ మీడియాలో ఓ సైన్ బోర్డు పోస్ట్ వైరల్‌గా మారింది.

r/IndiaMemes అనే ‘రెడిట్’ సామాజిక మాధ్యమ పేజీలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి సైన్ బోర్డులో తెలిపిన విషయం ఆసక్తికరంగా మారింది. అందులో ‘మోడీని విమర్శించినంత మాత్రాన నేను రాహుల్ గాంధీ అభిమానిని కాను’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే @signboard_wala యూజర్ ప్రదర్శించిన ఈ సైన్ బోర్డుపై నెటిజన్‌లు రకరకాలుగా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు విమర్శించడం ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన భాగం.. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే సాధారణ వ్యక్తులను కూడా నువ్వు పాకిస్తానీ వ్యక్తి, దేశ ద్రోహి, ఉగ్రవాది అంటూ ముద్ర వేస్తారని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది.

(Narendra Modi) మోడీని విమర్శిస్తే నిజంగానే రాహుల్ గాంధీ కోసం పని చేసే వ్యక్తినని బీజేపీ శ్రేణులు డిసైడ్ చేస్తాయని.. నేను అతనికి సంబంధించిన వ్యక్తిని కాదని చెప్పినా కూడా వినరని మరో వ్యక్తి కామెంట్ పెట్టారు. అవును నిజమే నేను ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు నా ఫ్రెండ్ నన్ను కాంగ్రెస్ పార్టీ వ్యక్తి? అని డిసైడ్ చేశాడని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ వైరల్ పోస్ట్ కింద కామెంట్‌ల రూపంలో నెటిజన్‌ల మధ్య సుదీర్ఘమైన చర్చ జరుగుతోంది. కాగా, సైన్ బోర్డు ప్రదర్శిస్తూ కొంత మంది వ్యక్తులు తమ అభిప్రాయాలు చెబుతుంటారు. సైన్ బోర్డులో వారు తెలిపే విషయాలు చాలా వరకు నిజం ఉంటుందని నెటిజన్‌లకు ఒక నమ్మకం ఉంది. వైరల్ పోస్ట్ ఇదే..

Next Story