- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌లో కల్లోలం.. మాజీ క్రికెటర్ భార్య సస్పెండ్
కాంగ్రెస్‌లో కల్లోలం.. మాజీ క్రికెటర్ భార్య సస్పెండ్

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూను సస్పెండ్ చేసింది. పదే పదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తాజాగా చర్యలు తీసుకుంది. కాగా, ఇటీవల తన భర్త నవజ్యోత్ సిద్ధూను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే, ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని నవజ్యోత్ కౌర్ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా.. పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రంగా ఉన్నాయని, ఐదుగురు నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని, వారు సిద్ధూ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉందని నవజ్యోత్ కౌర్ ఆరోపించారు. హైకమాండ్ దీనిని అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. సిద్ధూ దృష్టి పంజాబ్ అభివృద్ధిపైనే ఉందని, ఏ పార్టీకి ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదని, అయితే తాము మంచి ఫలితాలు ఇస్తామని అన్నారు. దీంతో పార్టీలో అంతర్గత కలహాలకు ఆజ్యం పోసేలా.. పార్టీ లైన్ దాటి మాట్లాడటంతో సిద్దూ భార్యను సస్పెండ్ చేశారు.






