Siddaramaiah: కర్ణాటక సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు..!

by Shamantha N |

బెంగళూరు తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కాగా.. ఈ కేసులో మరో కీలక పరిణామం జరిగింది.

Siddaramaiah: కర్ణాటక సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు..!
X

దిశ, నేషనల్ బ్యూరో:బెంగళూరు తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కాగా.. ఈ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శి కే.గోవిందరాజ్‌ను పదవి నుంచి తొలగించారు. అంతేకాకుండా, కర్ణాటక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ హేమంత్ నింబాల్కర్‌ సహా పలువురు కీలక పోలీసు అధికారులను బదిలీ చేసినట్లు సమాచారం. కాగా.. ఈ ఏడాది ఐపీఎల్ 2025 ట్రోఫీ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. దీంతో, బెంగళూరులో బుధవారం ఆర్సీబీ (RCB) విజయోత్సవ పరేడ్‌ నిర్వహించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం సాయంత్రం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.

అందర్నీ ఒకేసారి అనుమతించడం వల్లే

అయితే, అందరినీ ఒకేసారి అనుమతించడం వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో కర్ణాటక హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా పరిగణించి విచారణ జరిపింది. లక్షల మంది క్రీడాభిమానులతో ముడిపడిన కార్యక్రమాన్ని నిర్వహించడంలో వైఫల్యం ఎవరిదో తేల్చి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఈ ఘటనపై చర్యల్లో భాగంగా కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌, ఆర్‌సీబీ ప్రతినిధులను బాధ్యులుగా పేర్కొంటూ తక్షణమే అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా, బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సీ. బాలకృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సెంట్రల్ డివిజన్) శేఖర్ హెచ్. టెక్కన్నవర్, అదనపు పోలీస్ కమిషనర్ వికాస్‌ కుమార్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ ఏకే గిరీష్‌లను వెంటనే సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story