- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనాభా నియంత్రణ దక్షిణాదికి శిక్ష
దక్షిణాదిపై కేంద్రం అన్యాయమైన పన్ను విధానాలు, జీఎస్టీ కేటాయింపులు, విపత్తు సహాయ నిరాకరణ చేస్తుంది.

- డీలిమిటేషన్‌పై అమిత్ షా వ్యాఖ్యలు అసంబద్దం
- ఉత్తరాదిలో బీజేపీ బలోపేతం చేయడానికే ఈ వాదన
- కర్ణాటక సీఎం సిద్ద రామయ్య
దిశ, నేషనల్ బ్యూరో: డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు తగ్గవని, ఈ విషయంలో ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవని, దక్షిణాది రాష్ట్రాలను గందరగోళపరిచేలా ఉన్నాయని అన్నారు. అమిత్ షాకు పూర్తి సమాచారం తెలిసి ఉండ పోవచ్చు లేదంటే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఉద్దేశపూర్వకంగానే నష్టపరిచాలని భావిస్తుండవచ్చని సిద్దరామయ్య మండిపడ్డారు. డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా గణాంకాల ఆధారంగా చేస్తారా లేదంటే ప్రస్తుత లోక్‌సభ సీట్ల కేటాయింపును అనుసరించి చేస్తారా అన్నది స్పష్టం చేయాలని అమిత్ షాను డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్, మధ్యప్రదేశ్‌ల మాదిరిగా కాకుండా.. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణలో విజయవంతం అయ్యాయని అన్నారు. తాజాగా తీయబోయే జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ సీట్లను కేటాయిస్తే మాత్రం దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభలో గణనీయంగా తమ ప్రాధాన్యతను కోల్పోతాయని.. జనాభా నియంత్రణ చేయడం వల్ల దక్షిణాదికి శిక్ష వేసినట్లు అవుతుందని సిద్దరామయ్య అన్నారు.
తాజా జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే కర్ణాటకతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గవచ్చని సిద్దరామయ్య చెప్పారు. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కవ సీట్లను పొందుతాయి. ఈ రెండు సందర్భాల్లో అంతిమంగా దక్షిణాది రాష్ట్రాలే నష్టాన్ని భరించాల్సి వస్తుందని సిద్దరామయ్య అన్నారు. దక్షిణాది వాటా తగ్గకుండా నిరోధించడానికి 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా ఉంచాలని లేదంటే లోక్‌సభ సీట్ల సంఖ్యను విస్తరించాలని సిద్దరామయ్య కేంద్రాన్ని కోరారు.
దక్షిణాదిపై కేంద్రం అన్యాయమైన పన్ను విధానాలు, జీఎస్టీ కేటాయింపులు, విపత్తు సహాయ నిరాకరణ చేస్తుంది. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాలను బలహీనపరిచేందుకు మోడీ ప్రభుత్వం డీలిమిటేషన్‌ను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నదని సిద్దరామయ్య ఆరోపించారు. పునర్విభజనపై మోడీ ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహాన్ని చూస్తుంటే.. తమ పార్టీ ఆధిపత్యాన్ని అడ్డుకున్నందుకు దక్షిణాది ప్రజలను శిక్షించడమే అసలు ఉద్దేశంగా కనిపిస్తుందని సిద్దరామయ్య పేర్కొన్నారు.






