- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"సిద్దరామయ్య మరణించాడు" మెటా ట్రాన్స్‌లేషన్ పై భగ్గుమన్న సీఎం
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటక ముఖ్యమంత్రి కార్యాలయం(CMO) ఫేస్‌బుక్‌లో ప్రముఖ నటి బి సోరోజా దేవి మృతికి సీఎం సంతాపం తెలుపుతున్న ఫోటోలను షేర్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటక ముఖ్యమంత్రి కార్యాలయం(CMO) ఫేస్‌బుక్‌లో ప్రముఖ నటి బి సోరోజా దేవి మృతికి సీఎం సంతాపం తెలుపుతున్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలకు ప్రముఖ నటి సరోజా దేవి మృతికి సీఎం సిద్దరామయ్య సంతాపం ప్రకటించారు. అని కన్నడ భాషలో రాయగా దానిని మెటా ఆటోమెటిక్ ట్రాన్స్ లేషన్ టూల్ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించారు అంటూ తప్పుగా ప్రకటించింది. ఈ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవ్వడంతో పోస్టు చేసినవారిపై, మెటాపై సీఎం ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసుకునేవాళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మెటా తన కన్నడ భాష ఆటో ట్రాన్స్ లేషన్ ఫీచర్ ఖచ్చితంగా పనిచేసేవారకు నిలిపివేయాలని కోరారు. అంతే కాకుండా మెటా ప్లాట్ ఫామ్‌లలో కన్నడ కంటెంట్ తప్పుగా ట్రాన్స్‌లేషన్ చేయడం వల్ల వాస్తవాలు వక్రీకరించబడతాయని చెప్పారు. వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందన్నారు. సోషల్ మీడియాలో చేసే ట్రాన్స్ లేషన్స్ తరచూ తప్పుగా ఉంటున్నాయని పౌరులు గుర్తించాలన్నారు. టెక్ దిగ్గజాల ఇలాంటి నిర్లక్ష్యం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు. మరోవైపు జరిగిన తప్పిదంపై మెటా సిద్ధరామయ్యకు క్షమాపణలు చెప్పింది.






