- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Siddaramaiah: మా నాన్న రాజకీయ వారసుడు ఆయనే.. సిద్ధరామయ్య కుమారుడు హాట్ కామెంట్స్
కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాల వేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాల వేళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర (Yatheendra) కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య రాజకీయ జీవితం చివరి దశలో ఉందని ఆయన రాజకీయ వారసత్వాన్ని మంత్రి జార్కిహోళీ కొనసాగించాలని వ్యాఖ్యానించారు. బెంగళూరులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘నా తండ్రి జీవితం రాజకీయ జీవితం చివరి దశలో ఉంది. ఈ స్టేజీలో ఆయనకు మార్గదర్శకం చేయడానికి బలమైన భావజాలం కలిగిన నాయకుడు అవసరం. జార్కిహోళీకి అలాంటి సామర్థ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆయన కొనసాగించగలడు. పార్టీని సైతం సమర్థవంతంగా నడిపించగలడు. అలాంటి భావజాలం ఉన్న వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. ఆయన తన పనిని కొనసాగించాలి’ అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారాయి. యతీంద్ర వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. హై కమాండ్ నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఏ విషయంలోనైనా తుది నిర్ణయం అధిష్టానానిదేనని వెల్లడించారు.






