- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రవాదులపై నిఘా.. మధ్య, ఉత్తర కాశ్మీర్ జిల్లాలో SIA దాడులు
అపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుంది. ఈ మేరకు దేశంలోని అన్ని రకాల భద్రతా సంస్థలకు పూర్తి స్వేచ్చను ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: అపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం (Government of India) ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతుంది. ఈ మేరకు దేశంలోని అన్ని రకాల భద్రతా సంస్థలకు పూర్తి స్వేచ్చను ఇచ్చింది. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసుల రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) అనుమానిత ఉగ్రవాదుల కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా నేడు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ముఖ్యంగా "మధ్య, ఉత్తర కాశ్మీర్ జిల్లాల్లో ఈ దాడులు ఈ ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలపై కొనసాగుతున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని దాదాపు 20 ప్రదేశాలను, ముఖ్యంగా పుల్వామా, షోపియన్, కుల్గాం, అనంత్‌నాగ్ జిల్లాల్లో లక్ష్యంగా చేసుకుని SIA సోధాలు నిర్వహిస్తుంది.
మునుపటి దాడులు ఉగ్రవాదుల కుట్ర (terrorist conspiracy) కేసుపై ఈ ప్రాంతాలతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇక్కడ స్లీపర్ సెల్‌లు పాకిస్తాన్‌లోని హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. నిందితులు వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి భద్రతా దళాలు, కీలకమైన మౌలిక సదుపాయాల గురించి సున్నితమైన సమాచారాన్ని పంచుకోవడం లో పాల్గొన్నట్లు సమాచారంతో తాజా దాడులు నిర్వహిస్తున్నారు. కాగా ఆ దాడులు ప్రస్తుతం భారీ సెక్యూరిటీ మధ్య కొనసాగుతుండగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






