- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా.. కొత్త తేదీ ఇదే ?
ఇండియన్ అస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. ఆక్సియం-4 ప్రయోగాన్ని ఈ నెల 22వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ అస్ట్రోనాట్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. ఆక్సియం-4 (Axiom 4) ప్రయోగాన్ని గురువారం నిర్వహించాల్సి ఉండగా దానిని ఈ నెల 22వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల చేపట్టిన మరమ్మతు పనులు, ఇతర కార్యక్రమాలను మూల్యాంకనం చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆక్సియం స్పేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐఎస్ఎస్‌లో కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి అదనపు సమయం అవసరమని పేర్కొంది. కాగా, ఆక్సియం 4 మిషన్‌లో భాగంగా శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాములు ఐఎస్ఎస్‌కు వెళ్లనున్నారు. అయితే ఈ మిషన్ మొదట మే 29నే నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు, ఫాల్కన్ 9 రాకెట్‌లో ద్రవ ఆక్సిజన్ లీక్, ఐఎస్ఎస్‌లోని సర్వీస్ మాడ్యూల్‌లో లోపం వంటి సమస్యల కారణంగా ఐదు సార్లు రీ షెడ్యూల్ చేశారు.






