ఇస్రో చైర్మన్‌తో కాల్ మాట్లాడిన శుభాంశు శుక్లా.. మిషన్ వివరాలు గగన్‌యాన్‌కు ముఖ్యం!

by Phanindra |

ఐఎస్ఎస్ నుంచి ఇస్రో చైర్మన్‌తో శుభాంశు శుక్లా కాల్ మాట్లాడారు. ఈ మిషన్ వివరాలు గగన్‌యాన్‌కు చాలా ముఖ్యమని ఇస్రో చైర్మన్ అన్నారు.

ఇస్రో చైర్మన్‌తో కాల్ మాట్లాడిన శుభాంశు శుక్లా.. మిషన్ వివరాలు గగన్‌యాన్‌కు ముఖ్యం!
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ స్పేస్ కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా.. ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్‌తో ఫోన్ కాల్‌లో మాట్లాడారు. యాక్సియం మిషన్-4లో భాగంగా శుక్లా చేస్తున్న ప్రయోగాలు, తన ఆరోగ్యం గురించి నారాయణన్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐఎస్ఎస్‌లో చేస్తున్న ప్రయోగాలు, కార్యకలాపాలు అన్నింటినీ చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయాలని శుక్లాను ఆయన కోరారు. ఇలా తెలుసుకున్న విషయాలు భవిష్యత్తులో గగన్‌యాన్ కార్యక్రమానికి ఉపయోగపడతాయని చెప్పారు.

ఈ కాల్‌లో విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ ఎం మోహన్, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ డైరెక్టర్ పద్మకుమార్ ఈఎస్ తదితర సీనియర్ ఇస్రో అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఐఎస్ఎస్‌లో చేపడుతున్న పలు సైంటిఫిక్ కార్యకలాపాల గురించి వీరంతా తెలుసుకున్నారు.

వీరి ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చిన శుక్లా.. పరిశోధనల్లు ఎదురైన ఇబ్బందులను కూడా వివరించారు. తను ఐఎస్ఎస్ చేరుకోవడంలో ఇస్రో టీం కృషికి ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా స్టాండ్‌బై ఆస్ట్రోనాట్ ప్రశాంత్ బాలన్ నాయర్‌తో కూడా ఇస్రో చైర్మన్ మాట్లాడారు.

Next Story