- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఎస్ఎస్‌లో ఫేరెవెల్ పార్టీ.. భారత్ సారే జహా సే అచ్ఛా అన్న శుక్లా!
యాక్సియం మిషన్-4లో ఐఎస్ఎస్ వెళ్లిన శుభాంశు శుక్లా బృందానికి ఫేరెవెల్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్ ‘సారే జహా సే అచ్ఛా’ అని శుక్లా అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: యాక్సియం మిషన్-4లో అంతర్జాతీయ స్పేస్ సెంటర్‌కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తిరుగు ప్రయానానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఐఎస్ఎస్‌లో ఉన్న నాసా ఎక్స్‌పెడిషన్ 73 క్రూ.. శుక్లా బృందానికి ఫేరెవెల్ పార్టీ ఇచ్చింది. సోమవారం నాడు ఈ బృందం భూమ్మీదకు తిరుగు ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ నేపథ్యంలోనే వీరికిచ్చిన ఫేరెవెల్ పార్టీని యాక్సియం సంస్థ లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేసింది. జులై 14 సాయంత్రం 4.30 కు యాక్సియం అన్‌డాకింగ్ మొదలవుతుంది. మంగళవారం సాయంత్రం 3 గంటలకు ఈ బృందం భూమ్మీదకు చేరుకుంటుంది.
సారే జహా సే అచ్ఛా..
ఫేరెవెల్ పార్టీలో మాట్లాడిన శుక్లా.. తన ప్రయాణాన్ని, మిషన్‌లో సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు. ‘ఈరోజు అంతరిక్షం నుంచి చూస్తుంటే భారత్ ఎన్నో ఆశలతో చాలా ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. భారత్ ఇప్పటికీ సారే జహా సే అచ్చా (అన్ని దేశాల కన్నా గొప్పది)’ అని ఆయన చెప్పారు. దీంతో వ్యక్తిగతంగా తన అంతరిక్ష ప్రయాణం ముగుస్తున్నప్పటికీ.. ఈ రంగంలో భారత్ జర్నీ ఇప్పుడే మొదలవుతోందని అన్నారు. అలాగే ఈ మిషన్‌ను విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్ని పనులు చేస్తున్నా ఎప్పుడూ భూమి వైపు చూస్తూనే ఉన్నామని, తనకైతే అంతరిక్షం నుంచి భూమి చాలా అద్భుతంగా కనిపించిందని శుక్లా అన్నారు.






