రేపు ప్రధాని మోడీతో శుభాంశు శుక్లా భేటీ!

by Yella Dhawani Reddy |

యాక్సియం-4 విజయవంతం తర్వాత తొలిసారిగా ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఆదివారం (ఆగస్టు 17) భారత్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర సైన్స్ అండ్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా ఘనంగా స్వాగతించారు.

రేపు ప్రధాని మోడీతో శుభాంశు శుక్లా భేటీ!
X

దిశ, వెబ్ డెస్క్: యాక్సియం-4 విజయవంతం తర్వాత తొలిసారిగా ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా (Shubhamshu Shukla) ఆదివారం (ఆగస్టు 17) భారత్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర సైన్స్ అండ్‌ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఢిల్లీ సీఎం రేఖ గుప్తా ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా ప్రధాని మోడీతో (PM Modi) సోమవారం భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం, యూపీలోని సొంతూరు లక్నోకు బయలుదేరి వెళతారు. ఆగస్టు 22, 23 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న 'నేషనల్ స్పేస్ డే' కార్యక్రమాల్లో శుభాంశు శుక్లా ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరుగనున్నాయి. అంతరిక్ష సాంకేతికతపై యువతలో అవగాహన పెంపొందించేందుకు దీనిని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. కాగా, అమెరికాలోని ఫ్లోరిడా నుంచి జూన్‌ 25న నింగిలోకి దూసుకెళ్లిన యాగ్జియం–4 మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా కీలక పాత్ర పోషించారు. అంతరిక్షంలో ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, తిరిగి జూలై 15న భూమిపైకి చేరుకున్నారు.

Next Story