- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘హద్దులు దాటితే ఊరుకోను’.. ట్రోలర్స్‌కు శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట వార్నింగ్
ఐపీఎల్ నుంచి పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత, ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌కు గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ నుంచి పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత, ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌కు గురయ్యారు. కొందరు నెటిజన్లు ఆమెను పంజాబ్ కింగ్స్ జట్టుకు 'ఐరన్ లెగ్' అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. ఈ ఆన్‌లైన్ వేధింపులపై శ్రేష్ట అయ్యర్ తీవ్రంగా స్పందించారు. ట్రోలర్ల తీరును తప్పుబడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు వీడియోలను పోస్ట్ చేసి గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్‌లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ సమయంలో కోల్‌కతా నైట్ రైడర్‌తో జరగాల్సిన ఒక మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఆ మ్యాచ్ తర్వాత శ్రేష్ట అయ్యర్ పంజాబ్ జెర్సీ ధరించి, తోటి అభిమానులతో కలిసి ఒక సరదా వీడియో (రీల్) చేశారు. అందులో ఆమె. "సాడీ పంజాబియాన్ దా దిల్ వడ్డా హుందా ఏ.. లో, దిత్తా ఏక్ పాయింట్"(మా పంజాబీల హృదయం చాలా పెద్దది.. ఇదిగో మీకు ఒక పాయింట్ ఇచ్చాం) అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, సీజన్ సెకండ్ హాఫ్ పంజాబ్ వరుసగా ఓడిపోతూ కేవలం ఒక్క పాయింట్ తేడాతో ప్లేఆఫ్స్ రేసు నుండి తృటిలో తప్పుకుంది. దీంతో నెటిజన్లు పాత వీడియోను బయటకు తీసి, ఆమె వల్లే జట్టు ఓడిపోయిందంటూ విమర్శలు, ట్రోలింగ్ మొదలుపెట్టారు.
నా వల్ల నా కుటుంబాన్ని వేధిస్తున్నారు: శ్రేష్ట ఆవేదన
ఈ ట్రోలింగ్‌పై శ్రేష్ట స్పందిస్తూ.. " మీకు అది ట్రోలింగ్ వీడియోలా అనిపించవచ్చు. కానీ నా ఉద్దేశంలో అది కేవలం ఒక సరదా వీడియో మాత్రమే. నా సోదరుడి జట్టును సపోర్ట్ " చేయడమే నా ఉద్దేశం తప్ప ఎవరినీ కించపరచాలని కాదు. ఒక ఆటలో గెలుపోటములు సహజం. క్రికెట్ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే నా తమ్ముడు ఒక క్రికెటర్" అని స్పష్టం చేశారు. పరిస్థితి ఇంతటితో ఆగకుండా వ్యక్తిగత వేధింపులకు దారితీయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీరు నన్ను ట్రోల్ చేస్తే పర్వాలేదు. కానీ కొందరు పనిపాట లేని వాళ్ళు నా కార్యాలయానికి ఫోన్లు చేసే నన్ను. నా తోటి ఉద్యోగులను, నా విద్యార్థులను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. మీలాంటి వారిని చూస్తే నాకు జాలేస్తోందే" అని దుయ్యబట్టారు.
నా తమ్ముడికి ఎప్పుడూ అండగా ఉంటా..
మ్యాచ్ గెలిచినా, ఓడినా ఆటగాళ్ల కుటుంబాలను, వారి భార్యలను బ్లేమ్ చేయడం నెటిజన్లకు అలవాటుగా మారింది. నా తమ్ముడు (శ్రేయస్ అయ్యర్డ్) గెలిచినా, ఓడినా నేను ఎల్లప్పుడూ సెలబ్రేట్ చేసుకుంటాను. అతనికినా మద్దతు ఎప్పటికీ ఇలాగే స్థిరంగా ఉంటుంది. నన్ను ఎంత ద్వేషించినా పర్వాలేదు కానీ, నాతో సంబంధం ఉన్న అమాయకులను వేధించడం ఆపండి అంటూ శ్రేష్ట అయ్యర్ ట్రోలర్ల నోళ్లు నొక్కేశారు.






