- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Uttar Pradesh:మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
మహా కుంభమేళా(Maha Kumbh Mela) సందర్భంగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో ఈ రోజు (శనివారం) ఉదయం శ్రీ శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

దిశ,వెబ్‌డెస్క్: మహా కుంభమేళా(Maha Kumbh Mela) సందర్భంగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో ఈ రోజు (శనివారం) ఉదయం శ్రీ శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.
అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణల, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలైన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళ హారతి సమర్పించడం తో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కళ్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశం తో పులకించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ గోపీనాథ దీక్షితులు, హెచ్ డీపీపీ సెక్రటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో శ్రీ గుణ భూషణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.






