- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో సీఈఓకు షోకాజు నోటీసు
by Naga Rani Yarlagadda |
ఇండిగో ఫ్లైట్స్ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో ఫ్లైట్స్ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఈ అంశం సుప్రీం ముందుకు చేరింది. ఇండిగో విమాన సేవల్లో అంతరాయంపై సమాధానమివ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ అంతరాయంపై కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజు నోటీసు జారీ చేసింది. ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఒక ప్లానింగ్, పర్యవేక్షణ లేకపోవడంపై తామెందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని నోటీసులో తెలిపింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీనికి ముందు ఇండిగోపై తీసుకునే చర్యలపై సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఉన్నతస్థాయి భేటీ నిర్వహించింది.
Next Story






