- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరినీ చంద్రుడిపైకి తరలించాలా?.. భూకంపాల పిటిషన్‍పై సుప్రీం అసహనం
భూకంపాలపై దాఖలైన పిటిషన్‍పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత దేశ జనాభాలో 75 శాతం మంది అధిక భూకంప ప్రాంతంలో ఉన్నారని భూకంపాల నుంచి నష్టాన్ని తగ్గిచడానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఎక్కువ జనాభా భూకంప ప్రభావిత ప్రాంతాల్లో (Earthquake in India) ఉన్నారు కాబట్టి మనం అదరినీ చంద్రునిపైకి దరలించాలా అని అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మోహతాలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. జపాన్ లో ఇటీవలే అతి పెద్ద భూకంపం సంభవించిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకురాగా అలా అయితే ముందుగా మనం భారతదేశంలోకి అగ్నిపరత్వతాలను తీసుకురావాలని తర్వాత మన దేశాన్ని జపాన్‍తో పోల్చవచ్చు అని ధర్మాసనం పేర్కొంది. భూకంపం సంభవించినప్పుడు నష్టాన్ని తగ్గించడానికి అధికారులు ఏర్పాట్లు చేయడాన్ని ప్రభుత్వం చూసుకోవాల్సిన విధానపరమైన విషయం అని ఆ పని కోర్టు చేయలేదని పేర్కొంటూ ఈ పిటిషన్లను కొట్టివేసింది.






