Shot dead: ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీల కాల్చివేత.. ఇరాన్‌లో కలకలం

by B.Srinivas |

టెహ్రాన్ నగరంలో ఉన్న ఇరాన్ సుప్రీంకోర్టుపై ఓ వ్యక్తి కాల్పులకు తెగపడ్డాడు.

Shot dead: ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీల కాల్చివేత.. ఇరాన్‌లో కలకలం
X

దిశ, నేషనల్ బ్యూరో: టెహ్రాన్ నగరంలో ఉన్న ఇరాన్ సుప్రీంకోర్టు (Supreme court) పై ఓ వ్యక్తి కాల్పులకు తెగపడ్డాడు. ఈ దాడిలో అదే కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు ముగ్గురు జడ్జీలను లక్ష్యంగా చేసుకుని శనివారం ఉదయం దాడికి పాల్పడినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఇద్దరు న్యాయమూర్తులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. న్యాయమూర్తులు తమకు కేటాయించిన గదుల్లోకి వెళ్తుండగా కాల్చి వేసినట్టు తెలుస్తోంది. దాడికి గల కారణాలను వెల్లడించలేదు. మరణించిన వారిని సీనియర్ న్యాయమూర్తులు అలీ రజినీ (Ali Razini), మొఘిషే (Moghiseh)గా గుర్తించారు.

ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు దాడి తర్వాత, సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అప్పటికే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్టు ఇరాన్ మీడియా తెలిపింది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సుప్రీంకోర్టు భవనాన్ని ఖాళీ చేయించారు. అయితే మరణించిన న్యాయమూర్తులు జాతీయ భద్రత, గూఢచర్యం, ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story