Shot dead: అకాలీదళ్ నేత దారుణ హత్య.. పంజాబ్‌లో ఘటన

by B.Srinivas |

పంజాబ్‌లో ఎస్ఏడీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. అమృత్‌సర్‌లోని చెహెర్తా ప్రాంతంలో ఎస్ఏడీ కౌన్సిలర్ హర్జిందర్ సింగ్‌ను కాల్చి చంపారు.

Shot dead: అకాలీదళ్ నేత దారుణ హత్య.. పంజాబ్‌లో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత దారుణ హత్యకు గురయ్యాడు. అమృత్‌సర్‌ (Amruthsir) లోని చెహెర్తా ప్రాంతంలో ఎస్ఏడీ కౌన్సిలర్ హర్జిందర్ సింగ్‌ (Harjindher singh)ను కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్జిందర్ సింగ్ తన స్నేహితులతో కలిసి చెహర్తా సాహిబ్ గురుద్వారాలో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆయనను అడ్డగించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన హర్జిందర్ సింగ్‌ను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను గుర్తించారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. నేరానికి ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన తర్వాత పంజాబ్‌లో రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఎస్ఏడీ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ (Sukhbeer singh badal) ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు.

Next Story