- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shooting: అమెరికాలో వీకెండ్ పార్టీపై కాల్పులు.. ఇద్దరు మృతి
by B.Srinivas |
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నార్త్ కరోలినాలో శనివారం జరిగిన ఓ వీకెండ్ పార్టీ సందర్భంగా కాల్పులకు తెగపడ్డారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నార్త్ కరోలినా (North Karolina) లో శనివారం జరిగిన ఓ వీకెండ్ పార్టీ సందర్భంగా నిందితులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 11 మంది గాయపడ్డారు. ఫైరింగ్ టైంలో 150 మంది ఉన్నారని అయితే కాల్పుల శబ్దం వినగానే వారంతా అక్కడి నుంచి పారిపోయినట్టు అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని షెరీఫ్ కార్యాలయం తెలిపింది. కాగా, అమెరికాలో ఇటీవలి కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీన డర్హామ్‌లో హౌస్ పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
Next Story






