- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shooting: అమెరికాలో కాథలిక్ స్కూల్‌పై కాల్పులు.. ఇద్దరు పిల్లలు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మిన్నెసోటాలోని ఒక కాథలిక్ పాఠశాలలో ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మిన్నెసోటా రాష్ట్రంలోని ఒక కాథలిక్ పాఠశాలలో ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లకు మరణించగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం దాడి చేసిన వ్యక్తి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. స్కూల్‌లో సామూహిక ప్రార్థనలు జరుగుతుండగా నిందితుడు కిటీకిల గుండా ఫైరింగ్ చేసినట్టు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే పాఠశాల అధికారులు అప్రమత్తమై విద్యార్థులను భవనం నుంచి ఖాళీ చేయించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్‌మన్‌గా గుర్తించారు. ఆయన వద్ద నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకోగా వాటిపై ట్రంపును చంపండి, భారత్‌పై అణు బాంబు వేయండి వంటి స్లోగన్స్ రాసి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా, మిన్నియాపాలిస్‌లో 24 గంటల్లోనే నాలుగు కాల్పుల ఘటనలు జరిగినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు వైట్ హౌస్ తెలిపింది.






