Canada: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థిని మృతి

by Yella Dhawani Reddy |

కెనడాలో కాల్పులు కలకలం రేగింది.

Canada: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థిని మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కెనడాలో (Canada) కాల్పులు కలకలం రేపాయి. ఒంటారియోలో బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో భారతీయ విద్యార్థిని (Indian Student) మృతి చెందింది. మృతురాలు హమిల్టన్‌లోని కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్‌ రంధవా పోలీసులు గుర్తించినట్లు టొరంటోలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

రంధవా బస్టాప్‌ వద్ద వేచి ఉండగా.. రెండు కార్లలో వచ్చిన ఇద్దరు దుండగులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. అయితే, అందులోని ఓ బుల్లెట్‌ మిస్‌ అయ్యి రంధవాకు తగిలింది. ఘటనపై సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హర్‌సిమ్రత్‌ రంధవా మృతిపై భారత కాన్సులేట్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. మృతురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కాగా, ఇటీవల ఒట్టావా సమీపంలోని రాక్‌లాండ్‌ ప్రాంతంలో ఓ భారతీయుడు కత్తి పోట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Next Story