Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మృతి

by B.Srinivas |

నార్త్ కరోలినాలోని సౌత్ పోర్ట్ వద్ద ఉన్న డాక్ సైడ్ రెస్టారెంట్‌లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు.

Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నార్త్ కరోలినా (North Karolina) లోని సౌత్ పోర్ట్ వద్ద ఉన్న డాక్ సైడ్ రెస్టారెంట్‌లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ పోస్ట్ యాచ్ బేసిన్‌ ప్రాంతంలో ఉన్న అమెరికన్ ఫిష్ కంపెనీ అనే ఫేమస్ రెస్టారెంట్ వద్దకు ఒక చిన్న పడవలో వచ్చిన నిందితుడు కొద్దిసేపు అక్కడే ఆగాడు. ఆపై రద్దీగా ఉన్న జనంపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే దాడికి గల కారణాన్ని వెల్లడించలేదు. కాగా, ఈ నెల 24న కూడా డల్లాస్‌లోని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫీల్డ్ ఆఫీసుపై కాల్పులు జరపగా ఒకరు మరణించారు. అనంతరం నిందితుడు తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు.

Next Story