Assam: ధుబ్రీ జిల్లాలో షూట్-అట్-సైట్ ఆదేశాలిచ్చిన సీఎం హిమంత బిశ్వ

by S Gopi |   (  Updated:2025-06-14 15:54:24  IST  )

పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ శుక్రవారం ధుబ్రీని సందర్శించారు.

Assam: ధుబ్రీ జిల్లాలో షూట్-అట్-సైట్ ఆదేశాలిచ్చిన సీఎం హిమంత బిశ్వ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ధుబ్రీ జిల్లాలో రాత్రిపూట 'షూట్ ఎట్ సైట్' ఆదేశాలు అమలులో ఉంటాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ శుక్రవారం తెలిపారు. ధుబ్రీ పట్టణంలో మతపరమైన అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ధుబ్రీ పట్టణంలో ఒక ఆలయంలో మాంసం ముక్కలు కనిపించడంతో ప్రజలు నిరసనకు దిగారు. పరిస్థితి తీవ్ర పెరగకుండా సోమవారం పట్టణంలో నిషేధాజ్ఞలు విధించారు. పరిస్థితిని సమీక్షించడానికి ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ శుక్రవారం ధుబ్రీని సందర్శించారు. ఆవు మాంసాన్ని ఆలయంపై విసిరేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఉద్రిక్తతలు రెచ్చగోట్టేలా చేసిన వారిని ఉపేక్షించవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నేరస్తుల విషయంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన సీఎం, ధుబ్రీ పట్టణంలో 'షూట్ ఎట్ సైట్' ఆదేశాలు జారీ చేశారు. పవిత్రమైన ఆలయాలను అపవిత్రం చేయాలనే దురుద్దేశంతో జీరో టాలరెన్స్ పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. హనుమాన్ ఆలయంలో ఆవు తల, మాంసం అవశేషాలు కనిపించడంతో ఈ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలిచ్చానని, ఇవి రాత్రి సమయంలో అమల్లో ఉంటాయని వివరించారు. రాళ్లు రువ్వడం, ప్రభుత్వాస్తులపై దాడులకు తెగబడటం వంటివి జరిగితే అధికారులు తక్షణం స్పందించాలని స్పష్టం చేశారు. అస్సాంలో అశాంతిని రెచ్చగొట్టేందుకు అనేక శక్తులు సిద్ధంగా ఉన్నాయని ఆరోపించారు.

దీనికి సంబంధించి ఎక్స్‌లోనూ పోస్ట్ చేసిన సీఎం, బక్రీద్ సమయంలో ధుబ్రీలో ఏం జరిగింది, పరిస్థితి ఎలా ఉందనే దానిపై సమీక్షిస్తున్నాం. జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని చర్యలకు కట్టుబడి ఉన్నాం. ధుబ్రీ జిల్లాలో కొత్తగా ఆవు మాంసం మాఫియా పుట్టుకొచింది. బక్రీస్‌కు ముందు ఈ మాఫియా పెద్ద ఎత్తున పశువులను అక్రమంగా రవాణా చేసినట్టు సమాచారం ఉంది. ఇది రాష్ట్రంపై జరుగుతున్న అతిపెద్ద కుట్ర, ఈ ప్రాంతంలో అల్లర్లను రెచ్చగోట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హామీ ఇస్తున్నాను.

Next Story