- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ramdev Baba: మళ్లీ చిక్కుల్లో పడ్డ రాందేవ్ బాబా
బాబా రాందేవ్ పై మళ్లీ చిక్కుల్లో పడ్డారు. షర్బత్‌పై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: బాబా రాందేవ్ పై మళ్లీ చిక్కుల్లో పడ్డారు. షర్బత్‌పై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. హమ్ దర్డ్ కంపెనీకి చెందిన ప్రముఖ పానీయం రూహ్ అఫ్జాను లక్ష్యంగా చేసుకుని "షర్బత్ జిహాద్" వంటి వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఇది కోర్టు అంతరాత్మను షాక్‌కు గురి చేసిందని, ఇలాంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల ప్రారంభంలో బాబా రాందేవ్ పతంజలి గులాబీ షర్బత్‌ను ప్రారంభించినప్పుడు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. "మీకు షర్బత్ ఇచ్చే కంపెనీ సంపాదించే డబ్బును మదర్సాలు, మసీదులను నిర్మించడానికి ఉపయోగిస్తారు. కానీ మీరు దీన్ని తాగితే (పతంజలి గులాబీ షర్బత్‌ను ఉద్దేశిస్తూ) గురుకులాలు నిర్మిస్తాం. ఆచార్య కులం అభివృద్ధి చెందుతుంది. పతంజలి విశ్వవిద్యాలయం విస్తరిస్తుంది. భారతీయ శిక్షా బోర్డు పెరుగుతుంది" అని అన్నారు. కాగా.. బాబా రాందేవ్ హమ్‌దర్ద్ పేరుని ప్రస్తావించనప్పటికీ దాన్ని ఉద్దేశించే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే హమ్ దర్డ్ కంపెనీ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. కాగా..రాందేవ్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.






