షాకింగ్ వీడియో.. హాట్ ఎయిర్ బెలూన్ నుంచి పడిపోయిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-10 11:18:34  IST  )

రాజస్థాన్‌లో (Rajasthan) గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

షాకింగ్ వీడియో.. హాట్ ఎయిర్ బెలూన్ నుంచి పడిపోయిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో (Rajasthan) గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్‌ను పరీక్షిస్తుండగా ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందాడు. బారన్ (Baran) జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. బారన్ జిల్లా ఫౌండేషన్ డే సందర్భంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హాట్ ఎయిర్ బెలూన్‌ ప్రదర్శనను కూడా అక్కడ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా బెలూన్‌ను పరీక్షిస్తుండగా ఉన్నట్టుండి బెలూన్ గాలిలోకి లేవడంతో దానికి కట్టి ఉన్న తాడుకు చిక్కుకుని ఓ వ్యక్తి కూడా గాల్లో వేలాడాడు. అయితే, దాదాపు వంద అడుగుల ఎత్తుకు చేరుకున్నక తాడు తెగటంతో కిండ పడి మృతిచెందాడు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించాడని చెప్పారు. మృతుడిని రాజస్థాన్‌ కోటా (Kota)కు చెందిన వాసుదేవ్‌ ఖత్రిగా (Vasudev Khatri) గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story