వేద పాఠశాలలో షాకింగ్ ఘటన.. పక్క బెడ్‍పై పడుకున్నాడని దారుణం

by Prasad Jukanti |   (  Updated:2026-03-22 07:07:49  IST  )

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని వేద పాఠశాలలో దారుణం జరిగింది. పక్క విద్యార్థి మంచంపై పడుకున్నాడని ఓ బాలుడిని ఉపాధ్యాయుడు చితకబాదాడు.

వేద పాఠశాలలో షాకింగ్ ఘటన.. పక్క బెడ్‍పై పడుకున్నాడని దారుణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రమశిక్షణ పేరుతో విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాధిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్‍ ఉజ్జయినిలోని (Ujjain) ప్రముఖ మహర్షి సందీపని వేదవిద్యా సంస్థలో (Maharshi Sandipani Rashtriya Veda Vidya Pratishthan) ఈ దారణం వెలుగు చూసింది. ఈ వేద పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థి పొరపాటున తన పక్కన ఉన్న మరో విద్యార్థి మంచం మీద పడుకున్నాడనే కారణంతో ఉపాధ్యాయ బాధ్యతలతో పాటు వార్డెగా పని చేస్తున్న దత్తదాస్ షెవ్డే ఓ విద్యార్థిని బెత్తంతో చితకబాదాడు. ఆ దెబ్బలకు తాళలేక సదరు విద్యార్థి విలవిలలాటిపోయినా ఉపాధ్యాయుడు మాత్రం ఏ మాత్రం కనికరం చూపకుండా విచక్షణారహింతో వాతలు తేలాలో కొట్టాడు.

నెటిజన్ల సీరియస్:

ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు ఉపాధ్యాయుడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుచేసిన వారిని నచ్చజెప్పి అలాంటి తప్పులు జరగుండా ఒప్పించాల్సింది పోయి ఇలా కిరాతకుడిగా వ్యవహరించడం ఏంటని మండిపుడుతున్నారు. వేద విద్యను అందిస్తున్న ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఇక్కడ వేదవిద్యను అభ్యసించేందుకు విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు.

Next Story