టీవీ చూస్తుండగా ఏదో కదిలినట్లుగా అనిపిస్తేను.. దగ్గరికి వెళ్లి చూస్తే కనిపించిన తల.. కట్ చేస్తే

by Sujitha Rachapalli |

పాము కనిపిస్తేనే భయంతో పరుగెడతాం.. అదే మన ముందు అకస్మాత్తుగా దాని తల కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇమాజిన్ చేసుకునేందుకే భయంగా ఉంది కదా.. అయితే ఇలాంటి

టీవీ చూస్తుండగా ఏదో కదిలినట్లుగా అనిపిస్తేను.. దగ్గరికి వెళ్లి చూస్తే కనిపించిన తల.. కట్ చేస్తే
X

దిశ, వెబ్ డెస్క్ : పాము కనిపిస్తేనే భయంతో పరుగెడతాం.. అదే మన ముందు అకస్మాత్తుగా దాని తల కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇమాజిన్ చేసుకునేందుకే భయంగా ఉంది కదా.. అయితే ఇలాంటి నైట్‌మేర్ ఓ ఇంట్లో జరిగింది. కుటుంబం మొత్తానికి గుండె ఆగినంత పని అయింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ సియోనీ జిల్లాలోని బమ్హోరి గ్రామంలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. గోడపై బిగించిన స్మార్ట్ టీవీని చూస్తున్న కుటుంబానికి.. దాని వెనకాల ఏదో కదిలినట్లుగా అనిపించింది. దీంతో దగ్గరికి వెళ్లి చూడగా.. పాము తల కనిపించింది. ఒక్కసారిగా షాక్ అయిన కుటుంబం.. తెరుకుని స్నేక్ రెస్క్యూయర్ ప్రవీణ్ తివారీకి కాల్ చేశారు. ఇంటికి వచ్చిన ఆయన.. దాన్ని సురక్షితంగా క్యాచ్ చేసి తీసుకెళ్లాడు. దీంతో ఫ్యామిలీ ఊపిరిపీల్చుకుంది. కాగా ఆ పాము స్పెక్టకల్డ్ కోబ్రా అని.. ఇండియాలోని విషపూరిత జాతులలో ఒకటి అని చెప్పాడు స్నేక్ రెస్క్యూయర్.

Next Story