Viral: బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్.. తల్లి ఒడిలో నుంచి రోడ్డుపై పడిన చిన్నారి ఘటన.. వైరల్

by Ramesh Naini |

తమిళనాడులో ఓ చిన్నారికి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.

Viral: బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్.. తల్లి ఒడిలో నుంచి రోడ్డుపై పడిన చిన్నారి ఘటన.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (A child falling from the bus) తమిళనాడు (Tamil Nadu)లో ఓ చిన్నారికి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో తల్లి ఒడిలో నుంచి పిల్లవాడు రోడ్డుపై పడిన ఘటన నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. వివరాల్లోకి వెళితే.. గురువారం ఓ ప్రైవేటు బస్సు మధురై నుంచి (Srivilliputhur) శ్రీవిల్లిపుత్తూరుకు నడుస్తోంది. అందులో ఓ మహిళ తన సోదరుడు, ఇద్దరు కుమారులతో కలిసి బస్సు డోర్ పక్కన సీట్లో కూర్చోని ప్రయాణిస్తున్నారు. మహిళ ఏడాది వయసున్న పిల్లవాడిని తన ఒడిలో కూర్చో పెట్టుకుంది. అలాగే తన పెద్ద కుమారుడు ఆమె సోదరుడు ఒడిలో ఉన్నాడు. అయితే బస్సు మీనాక్షిపురం గ్రామం సమీపంలోకి రాగానే డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సులో ఒక కుదుపు ఏర్పడింది. ఈ క్రమంలోనే తల్లి ఒడిలో ఉన్న చిన్నారి డోర్ నుంచి రోడ్డుపై పడిపోతాడు. అదే సమయంలో తన సోదరుడు బస్సులోనే మరో పిల్లాడితో సహా ముందుకు పడిపోయాడు.

ఈ ఘటనలో రోడ్డుపై పడ్డ చిన్నారికి స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే ఆమె సోదరుడికి ముఖంపై తీవ్రంగా దెబ్బలు తగులుతాయి. మరో చిన్నారికి స్వల్ప గాయాలు అవుతాయి. దీంతో వారిని వెంటనే చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలిస్తారు. రోడ్డుపై పడిన చిన్నారికి అటువైపు ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ఘోర ప్రమాదం తప్పనట్లైంది. ఈ సంఘటన బస్సు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్యాసింజర్ బస్సు డోర్‌లు తెరిచి ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బస్సులు ప్రయాణిస్తున్న సమయంలో డోర్ క్లోజ్ చేసి ఉంటేనే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. వీడియో లింక్..

Next Story